పాకిస్థాన్ జట్టు కల నెరవేరింది అని చెప్పాలి. నిన్న మొదటిసారి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టును మొదటిసారి పాకిస్థాన్ జట్టు ఓడించి విజయం సాధించింది. దాంతో పాక్ అభిమానులు, ఆటగాళ్లు ఆనందంలో మునిగి తేలిపోయారు. అయితే అదే సమయంలో జట్టు ఆటగాళ్లకు కెప్టెన్ బాబురా ఆజమ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లతో బాబర్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ అయిపోయింది. మనం విజయం సాధించాం. అలా అని ఎవరు రిలాక్స్ కావద్దు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇందులో గెలిచినందుకు హోటల్ కు వెళ్లి కుటుంబాలతో సంబరం చేసుకుందాం. కానీ ఇక్కడితో ఆగి పోవద్దు. మనం ఇక్కడికి ఒక్క భారత్ పై కాదు ప్రపంచ కప్ టైటిల్ గెలవడానికి వచ్చాం అని ఆటగాళ్లకు చెప్పాడు బాబర్. అయితే, ఈ మ్యాచ్ ముందు వరకు ప్రపంచ కప్ టోర్నీలలో మొత్తం 12 సార్లు ఇండియాతో తలపడిన పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.