ఆసియా కుబేరుడు, అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్‌మా స్వదేశం చైనాకు తిరిగి వచ్చాడు. సోమవారం ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన దేశాన్ని వీడిన జాక్ మా.. దాదాపు ఏడాదిన్నర తర్వాత చైనాలో అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పిల్లలకు విద్యను ఎలా అందించాలనే దాని గురించి ఉపాధ్యాయులతో మాట్లాడటానికి అలీబాబా ప్రధాన కార్యాలయం ఉన్న హాంగ్‌జౌలోని యుంగు పాఠశాలను సందర్శించారు. జాక్ మా యుంగు స్కూల్‌కి వచ్చి క్యాంపస్ డైరెక్టర్‌లతో విద్యా భవిష్యత్తు గురించి చర్చించారు. కొత్త సాంకేతిక మార్పు తెచ్చే సవాళ్లు, అవకాశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
Also Read:Tuesday Stotram: ఈస్తోత్రం వింటే ఆరోగ్యంలో చికాకులు, చంచలత్వం తొలగిపోతాయి
గత కొన్ని నెలలుగా చైనాకు దూరంగా ఉన్న జాక్ మా.. స్పెయిన్, జపాన్, థాయ్‌లాండ్‌లలో కనిపించారు. చాలా రోజుల తర్వాత చైనాలో బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. 2020లో ప్రభుత్వ విధానాలను విమర్శించింనందుకు జాక్‌మా చిక్కుల్లో పడ్డారు. చాలా రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేసిందుకుగాను చైనా దర్యాప్తు సంస్థలు జాక్‌మాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. జాక్ మా ఆర్థిక బలాన్ని విపరీతంగా దెబ్బకొట్టాయి. ఆ తర్వాత జాక్.. కొన్ని రోజుల వరకు ఎవరికీ కనిపించకుండా పోయారు. బీజింగ్ దేశీయ రంగంపై నిబంధనలను కఠినతరం చేసింది. జాక్ మా స్థాపించిన ఆలీబాబా సంస్థ 2021లో $2.6 బిలియన్ల యాంటీట్రస్ట్ జరిమానాతో దెబ్బతింది. ఫిన్‌టెక్ సంస్థపై నియంత్రణను జాక్ మా నెమ్మదిగా వదులుకుంటూ వచ్చారు.
Also Read:TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్.. మరొకరి అరెస్ట్
టెక్ సెక్టార్‌పై చైనా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్ మరియు వ్యవస్థాపకులకు వ్యతిరేకంగా మారుతున్నారని పెట్టుబడిదారుల భయాలను రేకెత్తించారు. చైనా ప్రభుత్వం కొద్దికాలంగా సాంకేతికత, విద్య, ఆన్‌లైన్ గేమింగ్, ఫైనాన్షియల్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తోంది. దీంతో ప్రైవేటు రంగం కాస్త కుదేలైంది. కొవిడ్-19 ప్రభావం, ప్రభుత్వ కఠినమైన నిబంధనలతో ఆర్థిక వ్యవస్థను మందగించింది. దీంతో చైనా ప్రభుత్వం ప్రైవేట్ రంగంపై విశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు $33 బిలియన్ల సంపదను జాక్ మా కలిగి ఉన్నాడు.