మేషం : ఈరోజు మీరు ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. సాంఘిక, బంధు మిత్రాదుల యందు అన్యోన్యత తగ్గును. మీ వగ్ధాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశివారికి స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సినీ రంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది.
మిథునం : ఈ రోజు మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారికి గొప్ప అవకాశాలు దరిచేరతాయి. ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులను ఎదుర్కొంటారు. గృహ మరమ్మతులు, మార్పు, చేర్పులు వాయిదాపడతాయి. మీ యత్నాలను కొంత మంది నీరుగార్చేందుకు యత్నిస్తారు.
సింహం : ఈ రోజు ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. భాగస్వామిక చర్చలు, అర్థాంతరంగా ముగించాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కన్య : ఈరోజు మీ ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా సాగుతాయి. కోట్రు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. జాగ్రత్తలు అవసరం. మీ సంతానంపై చదువుల కోసం విదేశాలు వెళ్తారు. రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీయవచ్చు.
తుల : ఈరోజు ఈరాశిలోని ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. కుటుంబీకుల మధ్య అవగాహన లోపం, చీటికి మాటికి అందిరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విద్యార్థినుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. వస్త్ర, బంగారం, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు వస్త్ర లాభం వాహన యోగం వంటి శుభఫలితాలు ఉంటాయి.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు వస్త్రలాభం, వాహనయోగం వంటి శుభఫలితాలు ఉంటాయి. మీరెదురు చూస్తున్న రశీదులు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి కలిసిరాగలదు. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలు త్వరగా ముగించుకుంటారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. భూమి, ఇండ్ల వ్యాపారులకు ప్రభుత్వరీత్యా ధనం, ఆదాయం బాగుండును. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
కుంభం : ఈ రోజు మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ రావడానికి మరికొంత సమయం పడుతుంది. విద్యార్థినులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
మీనం : ఈ రోజు మీ ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. సత్కాలం ఆసన్నమవుతోంది. మీ ఆలోచనలు పథకాలు క్రియారూపంలో పెట్టండి.