నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాల విడుదలకానుంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 16న నామినేషన్ల దాఖలకు గడువు ఉండడంతో.. ఆలోపు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి.
Also Read
అధికార టీఆర్ఎస్ పార్టీకి 103, మిత్రపక్షమైన ఎంఐఎంకు 7,మొత్తం కలిపి 110 ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీకి పది మందికి పైగా ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆరు స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులే సునాయాసంగా ఏకగ్రీవం కానున్నారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కిస్తారు. ఎమ్మెల్సీలుగా చిన గోవిందరెడ్డి, మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గోవింద్ రెడ్డికి హామీ ఇచ్చిన జగన్.. మరో ఇద్దరి అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. శాసనసభలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతో.. ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?