భారతీయులకు బ్రిటన్ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. గతంలో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బ్రిటన్ వచ్చే భారతీయులు తప్పని సరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతులు పొందిన వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 10 రోజులు క్వారంటైన్ విధించడం సమంజసం కాదని, క్వారంటైన్ ఆంక్షలు విధిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ప్రకటించింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం దిగివచ్చింది. షరతులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎత్తివేసిన షరతులు ఈనెల 11 నుంచి అమలులోకి వస్తాయని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
Read: భయపెడుతున్న కోవిడ్: అక్కడ రికార్డ్ స్థాయిలో మరణాలు…