వైరల్ వీడియో: అవును.. అది జరిగింది: నయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్‌స్టార్ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం మాత్రమే కొనసాగిస్తున్నారని, పెళ్లి చేసుకొనే ఆలోచన వారికీ లేదంటూ కోలీవుడ్ లోను ఎక్కువ వార్తలే వినిపించాయి. అయితే, తాజాగా నయన్ తన ఎంగేజ్‌మెంట్ పై స్పందించింది. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తనకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని, దానికి సంబంధించి రింగ్‌ను చూపించి అందరికి షాకిచ్చింది. అయితే ఇది ప్రోమో కాబట్టి, ఏమైనా ట్వీస్ట్ ఉంటుందా? లేదా నిజంగా నయన్ కు ఎంగేజ్‌మెంట్ జరిగిందా! అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే..!
😍😍😍 Lady SuperStar நயன்தாரா – வரும் ஞாயிறு காலை 10:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #LadySuperstarNayanthara pic.twitter.com/TmY15QeVZ9
Also Read
— Vijay Television (@vijaytelevision) August 10, 2021
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!