దీపావళి వేళ శుభవార్త.. ఈ రాష్ట్రాలన్నీ పెట్రో ధరలు తగ్గించాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో రోజురోజుకూ పైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలకు బ్రేక్‌లు వేయాలన్న ఉద్దేశంతో.. ఇప్పటికే లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలకు అడుగులు వేస్తూ.. వాహనదారులకు ఊరట కలిగించేలా.. తమ పరిధిలోని వ్యాట్‌ను తగ్గిస్తూ శుభవార్త వినిపించాయి.. కేంద్రం నిర్ణయం వెలువడిన రోజు కొన్ని రాష్ట్రాలు, మరుసటి రోజు మరికొన్ని రాష్ట్రాలు ఇలా.. అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లాంటి రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి..
Read Also: నవంబర్ 5, శుక్రవారం దినఫలాలు…
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ఇక, వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో ఒడిశా మినహా మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న స్టేట్సే కావడం గమనించిన దగిన పరిణామం.. ఇక, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర తగ్గించిందనే విషయాన్ని పరిశీలిస్తే.. అసోం పెట్రోల్, డీజిల్‌పై రూ. 7 చొప్పున తగ్గించగా.. త్రిపుర కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, కర్ణాటక సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గోవా ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై రూ.7చొప్పున వ్యాట్‌ను కుదించింది.. బీహార్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90 చొప్పున కోత విధించగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2 వ్యాట్‌ను తగ్గించింది.. డీజిల్‌పై మాత్రం వ్యాట్ తగ్గించలేదు.. మరోవైపు పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్టు మణిపూర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. యూపీ ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించడంతో.. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రూ.12 మేర దిగివచ్చాయి. మరో బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.7చొప్పున కోత పెట్టింది.. ఇక, ఒడిశా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.3మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తగ్గించిన ధరలు అమల్లోకి రాగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!