సోషల్ మీడియా ఎంటర్‌టైన్ మెంట్ యాప్ లు కేవలం ఎంటర్‌టైన్ చేయడం మాత్రమే కాకుండా ప్రమాదాల నుంచి కూడా కాపాడుతున్నాయి. ఇటీవలే కిడ్నాపైన యువతిని టిక్‌టాక్ వీడియో కాపాడింది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని నార్త్ కరోలీనాలో 16 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తున్నారు. అయితే, నార్త్ కరోలీనాలో కిడ్నాప్‌కు గురైన యువతిని దుండగులు కెంటకీ తీసుకొచ్చారు. కారులో ఉన్న ఆ యువతి బయట ఉన్న వ్యక్తికి ఓ హ్యాండ్ సిగ్నల్ ఇచ్చింది.
Read: హిందూ ఆలయంలో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పూజలు…
ప్రమాదంలో ఉన్నప్పుడు ఇచ్చే సిగ్నల్. టిక్‌టాక్‌లో ఆ సిగ్నల్ పాపులరైన సిగ్నల్ అది. అనుమానం వచ్చిన ఆ వ్యక్తి వెంటనే 911 కి ఫోన్ చేశాడు. ఆ కారును ఫాలో అయ్యాడు. యువకుడి కాల్ ఆధారంగా పోలీసులు కారును ఛేజ్ చేసి కిడ్నాపర్లను పట్టుకున్నారు. నార్త్ కరోలీనాలో కిడ్నాప్ చేసిన యువతిని అక్కడి నుంచి టెన్నసీ, కెంటకీ మొత్తం తిప్పారని, యువతిని వ్యభిచార గృహానికి తరలించేందుకు కిడ్నాప్ చేసినట్టు కిడ్నాపర్ ఒప్పుకున్నాడు. ప్రమాదంలో ఉన్నప్పుడు బయట వ్యక్తులకు ప్రమాదంలో ఉన్నామని చెప్పేందుకు సోషల్ మీడియాలో కొన్ని సిగ్నల్ ఉన్నాయని, ఆ సిగ్నల్స్ ఆధారంగానే తాను బయటపడ్డానని ఆ యువతి చెప్పుకొచ్చింది.