ఏపీ ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయంతో రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాధితుడిని ఆదుకున్నారు మంత్రి నాని. రోడ్ ఆక్సిడెంట్ లో విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ మధ్యలో రోడ్ పక్కన పడి పోయాడు బాధితుడు శ్రీనివాస్ రెడ్డి. ఆ రూట్‌లో వెళుతున్న మంత్రి ఆళ్ళ నాని వెంటనే స్పందించారు. వెంటనే కారు దిగి క్షతగాత్రుడు దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్న ఆళ్ళ నాని…
ఆయన ఏపీలో డిప్యూటీ సీఎం. ఆయన్నే లైట్ తీసుకుంటున్నారట అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు. ఇటీవల ఒక విషయంలో తలెత్తిన రగడ చూశాక పార్టీ వర్గాల్లో వస్తోన్న డౌట్ ఇదేనట. ఇంతకీ ఎవరా డిప్యూటీ సీఎం..? ఏంటా మున్సిపల్ కార్పొరేషన్? లెట్స్ వాచ్..! డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని లెక్క చేయడం లేదా? ఎక్కడన్నా అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలు కొట్టుకోవడం, తిట్టుకోవటం కామన్. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైసీపీలో మాత్రం డిఫరెంట్. వాళ్లలో వాళ్లకే పడదో.. పదవి ఇచ్చినవాళ్లంటే…
ఏపీపై వైపు మరో తుఫాన్ తూసుకొస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం ప్రారంభమైంది.. తీరం వెంబడి క్రమేపీ గాలుల తీవ్రత కూడా పెరుగుతోంది.. సముద్రం అలజడిగా మారిపోయింది.. ఈదురు గాలులు తీవ్రత క్రమంగా పెరగడంతో.. వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, DMHOలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక సూచనలు చేశారు.. తుఫాన్ నేపథ్యంలో…
మరోసారి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోందని దీని పై సీఎం సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఒమిక్రాన్ వస్తే ఏం చేయాలనే అంశంపై సీఎం సూచనలు చేశారని ఆయన తెలిపారు.…
ఇప్పటికీ ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్ గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి ఆళ్లనాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మూడు గంటల పాటు చేసిన దీక్ష చూసి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని.. చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ఆయన అసలు స్వరూపం బయట పడిందని.. ఆయన పరిపాలన లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో తండ్రి, కొడుకులు హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ పెట్టుకుంటూ కాలక్షేపం చేశారని…
నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలని.. బెదిరింపులకు దిగుతారట.. ఓ హౌజ్ సర్జన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. నా రూమ్ లో ఏసీ ఉంది వచ్చేయ్ అని అంటావా..? రాకపోతే కాళ్లూ చేతులూ కట్టేసి నోటికి ప్లాస్టర్…
సీఎం ఆదేశాల మేరకు విమ్స్ ను సందర్శించాము. విమ్స్ ఏర్పాటు ప్రాధాన్యత రీత్యా చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. 400 ఆక్సిజన్ బెడ్స్ వున్నాయి..వీటిని ఆరు వందల బెడ్ లకు పెంచే ప్రతిపాదనలు చేశారు. ఆక్సిజన్ అందుబాటు బట్టి బెడ్ ల సంఖ్య పెంచే ఆలోచన వుంది. ఇప్పుడు విమ్స్ లో 10 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో వుంది. ఈ ఆక్సిజన్ కోటా శాతం పెంచే ఆలోచనలు వున్నయి. విమ్స్ లో 20…
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు మంత్రి ఆళ్ల నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రులు 420, ఐసియు బెడ్స్ 5,601, ఆక్సిజన్ బెడ్స్ 18,992గా ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా 3120 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరోనా సెకండ్ వేవ్ ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్న మంత్రి.. 104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా సీఎం…
నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడంతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని… కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇంచార్జి DMHO డాక్టర్ స్వర్ణలతకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ… నెల్లూరు జిల్లాలో 12 కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. నెల్లూరు గవర్నమెంట్ ఆస్పత్రులలో ప్రస్తుతం కరోనాతో…