భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… కొత్త‌గా ఎన్నంటే…

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  రోజు రోజుకు తీవ్ర‌స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా భార‌త్‌లో 33,750 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.   దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నార‌ని, నిన్న ఒక్క‌రోజులో 10,846 మంది కోలుకున్న‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 123 మంది మృతి చెందారు.  దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 4,81,893 కి చేరింది.  

Read: న‌లందా మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం: 87 మంది వైద్యుల‌కు క‌రోనా…

కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ఆదివారం రోజున 27 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ్వ‌గా, సోమ‌వారం రోజున ఆ సంఖ్య 33 వేల‌కు చేరుకుంది.  సుమారు 6 వేల‌కు పైగా కేసులు అద‌నంగా ఒక్క‌రోజులో పెరిగాయి.  అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  విద్యాసంస్థ‌లు, సినిమా హాళ్లు, పార్కులు, జిమ్‌లు వంటి వాటిని మూసివేశారు.  కార్యాల‌యాలు 50 శాతంతో ప‌నిచేస్తున్నాయి.  కేసులు ఇలానే పెరిగితే మ‌రిన్ని ఆంక్ష‌లు విధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు సూచించింది.  

Related Articles

Latest Articles