ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు క‌రోనా…

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తున్న‌ది.  రోజువారీ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  సామాన్యుల‌తో పాటు ప్ర‌ముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు.  తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క‌రోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు క‌రోనా సోకిన‌ట్టు కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.  త‌న‌కు ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉన్నాయని, వైద్యుల స‌ల‌హా మేర‌కు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని అన్నారు.  త్వ‌ర‌లోనే కోలుకొని తిరిగి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని, ఎవ‌రూ భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేద‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో రోజువారి కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  

Read: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది

అక్క‌డ పాజిటివిటీ రేటు 6కి పైగా న‌మోద‌యింది.  ఇప్ప‌టికే ఎల్లో అల‌ర్ట్ న‌డుస్తున్న‌ది.  ఈరోజు న‌మోద‌య్యే కేసుల‌ను అనుస‌రించి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుంది.  వీకెంట్ లాక్ డౌన్ విధించే అవ‌కాశం ఉన్న‌ట్టుగా నిపుణులు  చెబుతున్నారు.  కొత్తగా న‌మోద‌వుతున్న కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్న‌ట్టుగా ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.  కేసులు పెరుగుతున్న వేళ త‌గిన జాగ్ర‌త్తు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles