ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏడు రోజుల కస్టడీకి పంపింది. మద్యం పాలసీని రూపొందించడంలో మనీలాండరింగ్ ఆరోపణలపై సిసోడియాని ప్రశ్నించడానికి ఈడీ.. కనీసం 10 రోజులు కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిసోడియానే ప్రధాన సూత్రధారినని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఆయన్ను విచారించాల్సి ఉందని తెలిపింది. ఇందుకోసం 10 రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరింది. ఈడీ వాదనను సిసోడియా లాయర్ ఖండించారు. సిసోడియా ఇంట్లో గతంలో తనిఖిలు చేస్తే ఏమీ దొరకలేదని చెప్పారు.సిసోడియా తరుపున విజయ్ నాయర్ అన్ని తానై వ్యవహారించాడని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే, సిసోడియా స్కామ్ లో ఉన్నట్టుగా ఏ ఒక్క ఆధారం లేదని వాదించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అంతకుముందు ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించడంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అతన్ని అరెస్టు చేసింది. సీబీఐ కేసులో ఆయన బెయిల్ అభ్యర్థన ప్రత్యేక కోర్టులో ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా, దానిని మార్చి 21కి మార్చారు. ఫిబ్రవరి 26న సీబీఐ సిసోడియాను అరెస్ట్ చేసింది. మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
Also Read: Influenza A: మార్చి చివరి నాటికి ఇన్‌ఫ్లూయెంజా తగ్గుముఖం.. హెచ్3ఎన్2ను పరిశీలిస్తున్నామన్న కేంద్రం
కాగా, సిసోడియా సౌత్ గ్రూప్‌తో పాటు AAP కమ్యూనికేషన్స్-ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ , భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితతో కలిసి కుట్ర పన్నారని ED వాదిస్తోంది. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవి ఆప్ పేర్కొంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించనున్నారు.
Also Read: Kavitha: దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత.. రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం