తెలుగు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల మహేష్ నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నారు.. సినిమాలు మాత్రమే కాదు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు.. మరోవైపు బిజినెస్ లను కూడా చేస్తున్నాడు.. తనకు నచ్చిన వస్తువులను ఎంత ధర అయిన కొనడం మహేష్ బాబు స్టైల్.. ఇటీవల ఓ కారు కొన్న మహేష్ ఇప్పుడు మరో ఖరీదైన కారును కొన్నాడు.. ఆ కారు ధర అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.. రెండు, మూడు సినిమాలు తియ్యొచ్చు అని చెబుతున్నారు..
మనదేశం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరు. వాస్తవానికి మహేష్ బాబు నటించేది బహుశా ఏడాదికి ఒక నెమో.. అయినప్పటికీ ఆ కు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటాడు.. అంతేకాదు అనేక ప్రముఖ బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనలకు మహేష్ బెస్ట్ ఎంపిక అని భావిస్తారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా సరే.. ఫ్యామిలీకి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తూ.. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతూ పరిపూర్ణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్.. మానవత్వం ఉన్న హీరో కూడా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడాడు..
మహేష్ బాబు తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మహేష్ బాబు ఇటీవల రేంజ్ రోవర్ కారు కొన్నాడు. సాధారణంగా అందరూ గ్రాఫైట్ బ్లాక్, బ్లాక్, వైట్ కలర్ రేంజ్ రోవర్ కొంటారు.. అయితే మహేష్ బాబు మాత్రం గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కొన్నాడు. ఈ కారు కోసం మహేష్ బాబు 5.4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది రేంజ్ రోవర్ లో అత్యంత ఖరీదైన మోడల్.. మహేష్ దగ్గర ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి.. అవి కూడా కోట్లల్లో ఉన్నాయి.. రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి 7, బిఎమ్‌డబ్ల్యూ 7, రోల్స్ రాయిస్ వోగ్, బెంజ్ ఎస్ క్లాస్, ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు రేంజ్ రోవర్ కొత్త కారు కూడా మహేష్ బాబు కార్ల లిస్ట్ లో చేరింది.. ఇక సినిమాల విషయానికొస్తే..‘గుంటూరు కారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథలో కరెక్షన్స్ కారణంగా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యంగా నడుస్తోంది. ‘గుంటూరు కారం’ విడుదలైన తర్వాత మహేష్ బాబు రాజమౌళితో షూటింగ్ మొదలు పెట్టనున్నారు..