నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు… సెగలు రేపుతూనే ఉన్నాయి. వివాదాస్పద కామెంట్స్‌పై వంశీ క్షమాపణ చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్ మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కమ్మ కులంలో చీడపురుగులైన కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు.. అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలని అన్నారు. ఈ ముగ్గురిని భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. పరిటాల రవి బతికుంటే…ఏపీకి ఇప్పుడు పరిస్థితి వచ్చేది కాదన్నారు. దీంతో మల్లాది వాసు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Read Also: దూసుకొస్తున్న ‘జవాద్’.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
అయితే… తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మల్లాది వాసు. తాను వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఉద్దేశించి.. మాట్లాడలేదన్నారు. అన్న ఎన్టీఆర్ కుటుంబంపై ఉన్న అభిమానం, కమ్మ కులానికి జరుగుతున్న అన్యాయం చూసి.. బాధపడి వ్యాఖ్యలు చేశానని మల్లాది విష్ణు క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని… హత్యలు చేయించే కెపాసిటీ అస్సలు తనకు లేదన్నారు. కానీ కొంత మందికావాలని తన వ్యాఖ్యలను వక్రీకరించారని… తనకు ఎవరిపైనా.. కక్షలు లేవని తేల్చి చెప్పారు మల్లాది. తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే.. క్షమించాలని కోరారు మల్లాది వాసు.