భక్తి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. నిత్యం భక్తి కార్యక్రమాలతో వీక్షకులను భక్తి పారవశ్యంలో మునిగి తేలేలా చేస్తుంది. ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలా చేస్తుంది భక్తి టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్‌గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్‌ను సైతం…
Koti Deepotsavam 2025: రచన టెలివిజన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలు వెలిగిస్తారు.
Koti Deepotsavam 2025: భారతీయ ఆధ్యాత్మికతకు, సనాతన ధర్మానికి నెలవైన తెలుగు గడ్డపై భక్తి టీవీ ప్రతి సంవత్సరం నిర్వహించే అద్భుతమైన కార్యక్రమం ‘కోటి దీపోత్సవం’. ఈ దివ్యమైన కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తడానికి రెడీ అయింది. శివపార్వతుల అనుగ్రహం కోసం, భక్తులు కోటి దీపాల కాంతులలో ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది. 7000mah బ్యాటరీ, 50MP కెమెరా, IP64 రేటింగ్తో బడ్జెట్ రేంజ్లో రాబోతున్న Moto G06 4G స్మార్ట్ఫోన్ ఇకపోతే,…
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 12న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ కోటి దీపోత్సవ వేడుకలు ఆరంభం నుంచి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. నేడు కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవ వేడుకల్లో 11వ రోజు సందర్భంగా విశేషాలు చూద్దాం.. ముందుగా శ్రీశ్రీ రవిశంకర్ గూరూజీచే అనుగ్రహ భాషణం. అనంతరం శ్రీనండూరి శ్రీనివాస్‌చే ప్రవచనామృతం నిర్వహించనున్నారు.…
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తిటీవీ కోటి దీపోత్సవం కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. కన్నుల పండువగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇవాళ్టికి 10వ రోజుకు చేరింది. ఆదివారం కావడంతో ఈరోజు జరిగిన కోటి దీపోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈరోజు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆధ్వర్యంలో ప్రవచనామృతం…