ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండా కేకేఆర్ బరిలోకి దిగ్గుతుండగా ధోనిసేన మాత్రం బ్రావో స్థానంలో సామ్ కర్రన్ ను బరిలోకి దింపుతుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై రెండవ స్థానంలో ఉండగా… కేకేఆర్ నాల్గవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు పట్టికలో ఒక్క మెట్టు పైకి ఎక్కుతుంది. అంటే చెన్నై గెలిస్తే మొదటి స్థానానికి… కేకేఆర్ గెలిస్తే మూడవ స్థానానికి చేరుకుంటాయి.
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (C/WK), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
కోల్‌కతా : శుబ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (C), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (WK), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చకారవర్తి, ప్రసిద్ కృష్ణ