ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు చెప్తేచాలు వణుకుపుట్టేస్తుంది. పదేళ్ల క్రితం ఉత్తర కొరియాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిమ్ దేశం మొత్తాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడమే కాకుండా, పక్కనే ఉన్న దక్షిణ కొరియాకు, జపాన్‌కు నిద్రలేకుండా చేస్తున్నాడు. అందరూ కరోనా భయంతో లాక్‌డౌన్ చేసుకుంటే, కిమ్ మాత్రం దేశంలోకి కరోనాను ఎంటర్ కానివ్వకుండా సరిహద్దులను మూసేయించాడు. అంతేకాదు, హైపర్‌సోనిక్, విధ్వంసకర క్షిపణుల ప్రయోగాలు చేస్తూ దడపుట్టిస్తున్నాడు. కిమ్ పై ఉత్తర కొరియాలోనే కాదు ఏ దేశంలో అయినా విమర్శలు చేయాలంటే భయపడిపోతారు.
Read: జియాంగ్ లాక్‌డౌన్: మూడు రోజులకు ఒకసారి మాత్రమే బయటకు…
అయితే, దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కిమ్ మిన్ యోంగ్ అనే వ్యక్తి చూసేందుకు అచ్చంగా ఉత్తర కొరియా అధ్యక్షుడి మాదిరిగా ఉండటంతో అతడిని అందరూ హేళన చేసేవారు. దానిని స్పోర్టీవ్‌గా తీసుకున్న కిమ్ మిన్ యోంగ్ ఆ తరువాత అధ్యక్షుడు కిమ్‌లా మారిపోయి యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. కిమ్ ను అనుకరిస్తూ ఆయన పరువుతీసేలా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. కిమ్ అంటే పడని దేశాల ప్రజలు ఆ వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కిమ్ మిన్ యోంగ్ పాపులర్ కావడంతో ఆయనకు బెదిరింపులు రావడం మొదలుపెట్టాయి. తమ అధ్యక్షుడిని అనుకరించి వీడియోలు చేస్తే చంపేస్తామని, లైఫ్ ట్రబుల్స్ లో పడిపోతుంది జాగ్రత్త అని చెప్పి రోజుకు వందల కాల్స్ మెసేజ్‌లు వస్తున్నాయట. అయినప్పటికీ కిమ్ మిన్ యోంగ్ వెనక్కి తగ్గడం లేదు.