KCR: కేసీఆర్ చెప్పినా పట్టించుకోరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత నాలుగు రోజులుగా నాన్ స్టాప్‌గా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఆదివారం ప్రెస్ మీట్‌లో చెప్పారు. సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని విద్యా సంస్థలను మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని చాలా ఇంజనీరింగ్ కళాశాలలు సోమవారం ఒక్క రోజే సెలవు ఇచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా.. మూడు రోజులు సెలవు ఇవ్వాలనే సర్కారు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే తుంగలో తొక్కినట్లు సమాచారం. ఇంజనీరింగ్ కాలేజీలే కాదు. ప్రైవేట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ ఆర్డర్సంటే లెక్కలేనితనాన్ని చాటుకున్నట్లు కొంత మంది విద్యార్థులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మరికొన్ని స్కూళ్లు రోజుకి రెండు మూడు గంటలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు భోగట్టా.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
హాలిడే మూడ్‌లో ఏం చక్కా ఎంజాయ్ చేస్తున్న పిల్లల్ని ఇలా బలవంతంగా ఆన్‌లైన్ క్లాసుల పేరిట వేధించటం ఎంతవరకు సబబని కొందరు పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. కొంత మంది పిల్లలు స్కూల్ లేదనే ఉద్దేశంతో బుక్స్ పక్కన పెట్టి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటే వాళ్ల స్వేచ్ఛను హరించటం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ అనూహ్యంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించటంతో పలువురు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేక ఇబ్బందిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ లేక ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది.
కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తూ ఎనిమిది నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఐదారు గంటల పాటు ఆన్‌లైన్ క్లాసులు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్ధ గంట సేపు మాత్రమే బ్రేక్ ఇస్తున్నారని స్టూడెంట్స్ వాపోతున్నారు. విద్యా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. వాతావరణం సహకరించకున్నా విద్యార్థులను వదిలిపెట్టరా అని మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!