బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంత కాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. కత్రినా అయితే గత 15 సంవత్సరాలుగా తన పెళ్లికి సంబంధించిన ఈ పుకార్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కానీ దీపావళి సందర్భంగా ఇద్దరూ ప్రైవేట్‌గా ‘రోకా’ వేడుకను జరుపుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సినీ నిర్మాత కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగింది. కత్రినా కబీర్‌ను తన సోదరుడిలా భావిస్తుంది. అందుకే అక్కడ ఈ వేడుకను జరుపుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. డిసెంబర్ 7 నుండి 12 వరకు వివాహం జరగనుంది. ఈ ఇద్దరు ప్రేమ పక్షులు రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని 14వ శతాబ్దపు కోట సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నారు. పెళ్లికి సంబంధించిన హోటల్‌లో బుకింగ్ పూర్తయింది. అయితే దీని అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
Read Also : “గాడ్ ఫాదర్”లో స్టార్ హీరో పక్కా… రివీల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కత్రినా, విక్కీ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడం కోసం చాలా ఈవెంట్ కంపెనీలు కలిసి పని చేస్తాయి. వేర్వేరు ఈవెంట్‌ల కోసం వేర్వేరు కంపెనీలను నియమించుకుంటున్నారని తెలుస్తోంది. పరిస్థితిని సమీక్షించేందుకు 10 మంది సభ్యుల బృందం మంగళవారం సిక్స్ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకుంది. హోటల్ యాజమాన్యం నుంచి అందిన సమాచారం మేరకు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీమ్ పర్యవేక్షించింది. వరుడు గుర్రం మీద కూర్చొని ఏ ప్రదేశం నుండి వస్తాడు? మెహందీ ఎక్కడ నిర్వహిస్తారు ? మొదలైన వాటిని చూసుకుంటున్నారు. అయితే పెళ్లి కార్యక్రమాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్యాలెస్‌లో 48 లగ్జరీ సూట్‌లు ఉన్నాయి. ఇవి 700 ఏళ్ల నాటి రాజరిక వాతావరణాన్ని తలపిస్తాయి. ఈ కోటను రాజస్థానీ స్టైల్‌లో, అత్యాధునిక సాంకేతికతను జోడించి హోటల్ గా తీర్చిదిద్దారు. ఈ వేడుకను ఖర్చు కూడా భారీగానే కానుంది.