ఆ పర్యాటకులను ఆకర్షిస్తున్న కాశ్మీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్ మంచు సోయగాలను చూసేందుకు అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే శనివారం జమ్మూకాశ్మీర్ టూరిజం రోడ్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా పట్నిటాప్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ షేర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు 5.5 లక్షల మంది దేశీయ పర్యాటకులు జమ్మూకాశ్మీర్‌ను సందర్శించారని, వీరిలో 10 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టూర్ ఆపరేటర్లే కాకుండా, తెలుగు పర్యాటకుల కోసం స్థానిక హోటల్‌లు, ధాబాలు ఇప్పుడు ఇడ్లీ, సాంబార్ ఇతర సాధారణ దక్షిణ భారతీయ వంటకాలను అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్‌కు భారీగా పర్యాటకులు తరలివచ్చారని తెలిపారు.

మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, చాలా మంది పర్యాటకులు ఇప్పుడు జమ్మూలోని పట్నిటాప్, భదర్వా, సనాసర్ మరియు ఇతర ప్రదేశాలను సందర్శించడాని అనువైన స్థలంగా ఎంచుకుంటున్నారని, అదేవిధంగా, కాశ్మీర్‌లో ఎక్కువ మంది పర్యాటకులు గురేజ్, సోన్‌మార్గ్, పహల్గామ్ తో పాటు ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ టూరిజం ఇప్పుడు గురేజ్, కోకెర్‌నాగ్, బసోలి, వుల్లార్, అహర్బల్, క్రిమ్చి టెంపుల్స్, కొంగ్‌వాట్, రంజిత్ సాగర్ డ్యామ్, ధిమ్‌గఢ్ ఫోర్ట్ ఇతర ప్రాంతాలతో సహా 75 కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించిందని, ఈ ప్రదేశాలన్నీ రాఫ్టింగ్, పర్వతారోహణ, ట్రెక్కింగ్ మరెన్నో సహా తీర్థయాత్ర, సాహస పర్యాటకాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!

పర్యాటకులు హోం స్టేలు, బోట్ హౌస్‌ల ద్వారా స్థానిక ప్రజల ఆతిథ్యాన్ని అనుభవించవచ్చని గుమర్గ్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో జహూర్ అహ్మద్ రైనా తెలిపారు. టూరిస్టుల కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు, ఎస్‌హెచ్‌ఓలను మోహరించినందున పర్యాటకులు భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత కొన్ని నెలల్లో, అనేక మంది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, వీఐపీలు, సీనియర్ అధికారులతో సహా 19 ప్రతినిధి బృందాలు జమ్మూకాశ్మీర్‌లోని వివిధ జిల్లాలను సందర్శించాయని ఆయన వెల్లడించారు.

తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!