అసలు బీజేపీ అధ్యక్షుడు ఎవరు : కరీంనగర్ మేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పడం జరిగిందని, టీఆర్ఎస్ అభ్యర్థులు గా భాను ప్రసాద్, ఎల్ రమణ లు ఉన్నారని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నా ఈటల రాజేందర్ నా అర్థం కావట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయట్లేదని బండి సంజయ్ అంటే ఈటల రాజేందర్ పోటీలో పెట్టామని అంటున్నారని, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయన్నారు. ఈటల రాజేందర్ పెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళను కలుస్తున్నాడని, దమ్ముంటే పార్టీ ద్వారా కొట్లాడాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఎంపీ ఓ స్టేట్ మెంట్ ఎమ్మెల్యే ఓ స్టేట్ మెంట్ ఇస్తున్నారన్నారు.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
బండి సంజయ్ కు చెక్కు పెట్టాలని ఈటల చూస్తున్నాడన్నారు. హుజురాబాద్ లో ఇలానే కుమ్మక్కు రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ ని అమ్ముకున్నరని, ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కు తెలియకుండా బీజేపీ కార్పొరేటర్లు ఈటల పెట్టిన అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారని, టీఆర్ఎస్ బలంగా ఉందని కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు.
బీజేపీ అధ్యక్షుడు కూడా మారే ఆవకాశం ఉందని తెలుస్తోందని, టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయిందని రవీందర్ సింగ్ అన్నాడని కానీ పతనం అయింది రవిందర్ సింగ్ నేనని ఆయన అన్నారు. మేయర్ గా ఉండి 50 మంది కార్పొరేటర్లకే హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఇక ఎంపీటీసీలకు ఇస్తావా.? అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!