భారత్‌లో తగ్గిన కరోనా కేసులు.. 46 రోజుల్లో అతి తక్కువ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 173,921 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇది 46 రోజుల్లో అతి తక్కువ రోజువారీ కేసుల సంఖ్య, అయితే, రోజువారీ మరణాల సంఖ్య మూడువేలకు పైగానే నమోదు అవుతోంది.. తాజాగా మరో 3,563 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 2,84,601 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,19,431కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,18,821 మంది మరణించారు.. ఇక, రికవరీ కేసులు 2,51,78,011కు పెరిగాయి..
గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 31,079 కొత్తకేసులతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాత కర్ణాటకలో 22,823 కొత్త కేసులు, కేరళలో 22,318 కేసులు, మహారాష్ట్రలో 20,740, ఆంధ్రప్రదేశ్‌లో 14,429 కేసులు, పశ్చిమ బెంగాల్లో 12,193 కేసులు వెలుగు చూశాయి.. ఇక, అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 5,692,920, కర్ణాటకలో 2,546,821, కేరళలో 2,470,872, తమిళనాడులో 2,009,700, ఉత్తర ప్రదేశ్ లో 1,686,267, ఆంధ్రప్రదేశ్ లో 1,657,96 కేసులు నమోదు అయ్యాయి.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 17,01,13,245కు చేరింది.. ఇప్పటి వరకు 15,20,94,863 మంది కోలుకోగా, 35,36,896 మంది మరణించారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!