భారత్ కరోనా పాజిటివ్ కేసులు మరింత తగ్గాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,948 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 403 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఒక, ఒకేరోజులో 38,487 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,24,234కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,16,36,469 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ బారినపడి 4,34,367 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 3,53,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,23,612 మందికి వ్యాక్సిన్ వేశామని.. ఇప్పటి వరకు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 58,14,89,377కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.