భారత్ లో రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. మరోసారి 2 లక్షలకు పైగా నమోదయ్యాయి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య. పాజిటివ్ కేసులు తగ్గినా….“కరోనా” మరణాలు ఆగడం లేదు. దేశంలో గడచిన 24 గంటలలో 2,11,298 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…3,847 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,83,135 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 24,19,907కు చేరగా…“కరోనా”కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,46,33,951కు చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,15,235కు చేరింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 21,57,857 “కరోనా” వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.