మనదేశం నుంచి విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ అవసరం ఎంతో ఉంటుంది. అయితే, ఇతర దేశాల్లో పర్యటించాలి అంటే తప్పనిసరిగా వీసా కావాలి. కానీ, కొన్ని దేశాల పాస్ పోర్ట్‌లు ఉంటే చాలు వివిధ దేశాల్లో ఎంచక్కా పర్యటించి రావొచ్చు. వీసాతో అవసరం లేదు. సింగపూర్, జపాన్ దేశాలకు సంబంధించిన పాస్‌పోర్టులు ఉంటే చాలు. వీసాలతో అవసరం లేకుండా 192 దేశాలకు వెళ్లిరావొచ్చు. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్టులు ఇచ్చే దేశాల ఆధారంగా ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే, ఇండియా పాస్ పోర్ట్ ఉంటే 58 దేశాల్లో తిరిగిరావొచ్చు. 2020 వ సంవత్సంలో 63 దేశాలకు అనుమతి ఉండగా, ఈ ఏడాది అది 58 దేశాలకు మాత్రమే పరిమితం అయింది.
Read: హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ ఒక్కటే కాదు… ఇవీ ఫేమస్సే…