చైనాలో పెరుగుతున్న ఘోస్ట్ సిటీలు…

చైనాలో రియ‌ల్ ఎస్టేట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఎవ‌ర్ గ్రాండే సంస్థ అప్పుల్లో కూరుకుపోవ‌డంతో రియాల్టి రంగం అతలాకుత‌లం అయింది.  9 కోట్ల మందికి స‌రిప‌డా ఇళ్లు ప్ర‌స్తుతం చైనాలో ఖాళీగా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.  1970 త‌రువాత ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయం కంటే ఇత‌ర వృత్తుల‌పై దృష్టిపెట్ట‌డంతో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది.  దీంతో రియాల్టీ రంగం ఊపందుకుంది.   40 ఏళ్ల కాలంలో అనేక కొత్త ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు వెలిశాయి.  దానికి త‌గ్గ‌ట్టుగానే రియాల్టీ రంగం కూడా పెరిగిపోయింది.  చైనాలోని సంప‌న్నులు గృహాల‌ను కొనుగోలు చేసి ఖాళీగా ఉంచుతున్నారు.  ఇలా ల‌క్ష‌లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. 2019 లో చైనాలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఒక్క‌సారిగా ఈ రంగం కుదేలైంది.  ఎవ‌ర్ గ్రాండే ఒక్క‌సారిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది.  ఒక్క ఎవ‌ర్ గ్రాండే మాత్ర‌మే కాదు, ఇలాంటి అనేక రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.  ఈ రంగం తిరిగి నిల‌బ‌డాల‌ని పూర్వం మాదిరిగా రియాల్టీ రంగం వృద్ధి చెందాలి అంటే ప్ర‌భుత్వం వీటిని ఆదుకోవాల్సి ఉంటుంది. ఘోస్ట్ సిటీలు పెరిగిపోవ‌డం చైనాకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్న‌ది.  

Read: కాకీనాడ మేయ‌ర్‌పై అవిశ్వాసం… ప‌ద‌వి కోల్పోయిన సుంక‌ర పావ‌ని…

-Advertisement-చైనాలో పెరుగుతున్న ఘోస్ట్ సిటీలు...

Related Articles

Latest Articles