దేశంలో పుత్తడికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతున్నది. ఇక పండుగ సీజన్ వచ్చింది అంటే బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూసుతుంటారు. కొనుగోలు పెరిగితే ధరలు పెరిపోతుంటాయి. కరోనా నుంచి కోలుకొని మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో దీని ప్రభావం ధరలపై పడింది. తాజాగా మరోసారి పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. పుత్తడితో పాటుగా వెండి ధరలు కూడా పెరగడం విశేషం. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి.
Read: నవంబర్ 3, బుధవారం దినఫలాలు…
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.44,800కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 48,870కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ.68,900కి చేరింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.