మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఒక్క సారిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్… నిర్వహించిన ఓ శుభకార్యంలో సందడి చేశారు. అదేంటి… టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి ఈటల రాజేందర్ వెళ్లడమేంటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమే.
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల రాజేందర్. అయితే.. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. అక్టోబర్ 30 వ తేదీన… జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలుపొందారు.