Jobs Scam Case : తేజస్వి యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు నిర్వహించింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేసింది.
Also Read:Delhi Tension Live: ఢిల్లీలో హైటెన్షన్.. ఇవాళ ఈడీ ముందుకు కవిత
మనీలాండరింగ్ విచారణకు సంబంధించి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కుమార్తెలు,ఆర్జేడీ నేతల నివాసాలతో సహా బీహార్‌లోని పలు నగరాలు, ఇతర ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.ఢిల్లీలోని లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతితో పాటు బీహార్‌లోని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబు దోజానా నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ఎన్‌సిఆర్,బీహార్‌లోని 15 కి పైగా ప్రదేశాలలో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఇడి ఈ సోదాలు నిర్వహించింది.
Also Read:Liquor Scam: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. విచారణపై ఉత్కంఠ
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఉద్యోగాల కోసం భూమి కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్‌ను సీబీఐ బృందం ప్రశ్నించిన కొద్ది రోజుల తర్వాత ఫెడరల్ ఏజెన్సీ ఈ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్‌ను సీబీఐ మంగళవారం రెండు సెషన్లలో దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని కూడా సీబీఐ సోమవారం ఆమె పాట్నా (బీహార్) నివాసంలో ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 15న తమ ముందు హాజరుకావాలని లాలూ ప్రసాద్‌తో పాటు ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు గత నెలలో సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసింది. 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం లాలూ ప్రసాద్ మరియు అతని కుటుంబ సభ్యులు కొందరు ప్లాట్లు లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!