దక్షిణాది తారలలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఇళయదళపతి విజయ్ ఒకరు. సినిమా సినిమాకు తన పాపులారిటీ మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. ఇప్పుడు తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబోతున్నారు. దీనిని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ 65 వ సినిమాన ‘బీస్ట్’ను దిలీప్ నెల్సన్‌తో చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణలతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
#Thalapathy66… Sharing with you all an exciting update about my next film with The #Thalapathy @actorvijay Sir, Produced by #DilRaju garu & #Shirish garu under my home banner @SVC_official pic.twitter.com/R24UhFGNlW
— Vamshi Paidipally (@directorvamshi) September 26, 2021