దేశంలో కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఢిల్లీలో ఈరోజు 509 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఒక రోజు ముందు 15.64% నుండి 26 శాతానికి పెరిగాయి. దేశంలో H3N2 ఇన్ఫ్లుఎంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తాజా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.
Also Read:Sabitha Indra Reddy : మీ స్వార్ధ రాజకీయాల కోసం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతారా
ఢిల్లీలో గత కొన్ని నెలలుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జనవరి 16న ఇది సున్నాకి పడిపోయింది. అయితే, మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో బుధవారం 26.54 శాతం పాజిటివ్ రేటుతో 509 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నగరంలో మొత్తం 1,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు పెరగడానికి తక్కువ పరీక్ష సంఖ్యలు కారణమని నిపుణులు పేర్కొన్నారు. గత 24 గంటల్లో దేశ రాజధానిలో దాదాపు 1,918 పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కేసులు 500పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇది ఏడు నెలల కంటే ఎక్కువగా ఇప్పుడే నమోదు అయ్యాయి.
Also Read:Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదు
దేశవ్యాప్తంగా మొత్తం 4,435 తాజా COVID-19 కేసులు నమోదయ్యాయి. మంగళవారం 3038 కేసుల రికార్డు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య నాలుగు వేలు దాటడడం ఆందోళన కలిగిస్తోంది. ఇది గత ఆరు నెలల్లో అత్యధికంగా ఒకేరోజు పెరుగుదల అని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో ప్రస్తుతం క్రియాశీల కోవిడ్ కేసులు 23,091 ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్ కోసం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.