ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.17 కోట్ల విలువ చేసే కేజీ కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సిజ్ చేశారు. టాంజానియా లేడి కిలాడీ వద్ద కొకైన్ ను కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ గుర్తించారు. కొకైన్ తరలించడానికి ఇథియోపియా ప్రయాణికురాలు కొత్తగా స్కెచ్ వేసింది. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం బాటిల్స్ లో నింపింది కిలాడి లేడి. విదేశాల నుండి ఓ ప్రయాణీకుడు 3 మద్యం బాటిల్స్ తీసుకొని వచ్చే వెసులుబాటు ఉంది. దీంతో మద్యం బాటల్స్ ను ఎవ్వరూ తనిఖీలు చేయరని పసిగట్టి, కొకైన్ ను మద్యం బాటిల్స్ లో కలిపి తరలించే యత్నించింది. డ్రగ్స్ వాసన పసిగట్టిన కస్టమ్స్ ట్రైనింగ్ డాగ్… మద్యం బాటిల్స్ ఉన్న కవర్ వద్దకు వచ్చి కూర్చుంది. దీంతో మద్యం బాటిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read:HAIR TIPS: చుండ్రు సమస్యను చిటికెలో మాయం చేసే పిండి ఇదే..!
కాగా, ఇటీవల నైరోబీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రూ. 21 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నిందితుడి నుంచి మూడు కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్పాట్ ప్రొఫైలింగ్ ఆధారంగా ఢిల్లీలోని IGIA వద్ద ఎయిర్ కస్టమ్స్ నైరోబీ నుండి వచ్చిన ఒక భారతీయుడిని అరెస్టు చేసింది. రూ. 21 కోట్ల విలువైన సుమారు 3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. హీరోయిన్ అతని బ్యాగ్‌లోని తప్పుడు అడుగులో దాచిపెట్టాడు.