నేడు ఐపీఎల్ 2021 లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. అయితే 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(40), ఫాఫ్ డు ప్లెసిస్(43) శుభారంభాన్ని అందించారు. గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత వచ్చిన మోయిన్ అలీ(32)తో రాణించాడు. దాంతో చెన్నై సులువుగా విజయాన్ని అందుకుంటుంది అనుకున్న సమయంలో వరుస వికెట్లు కోల్పోయింది జట్టు. అయితే చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 26 పరుగులు కావాల్సి ఉండగా జడేజా రెండు సిక్సులు, ఫోర్లతో 22 పరుగులు సాధించాడు. ఆ తర్వాత చివరి 6 బంతుల్లో విజయానికి 4 పరుగులే కావాల్సిన మొదటి బంతికే నరైన్ బౌలింగ్ లో సామ్ కర్రన్ ఔట్ అవుతాడు. ఆ తరత రెండో బాల్ డాట్ కాగా మూడో బంతికి శార్దుల్ ఠాకూర్ మూడు పరుగులు సాధిస్తాడు. ఇక ఆఖరి మూడు బంతుల్లో ఒక్క పరుగే కావాల్సి ఉండగా ఒక్క బంతి డాట్ కాగా మరో బాల్ కు జడేజా ఔట్ అవుతాడు. దాంతో చెన్నై కి ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాల్సి వస్తుంది. అప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన దీపక్ చాహర్ ఆ ఒక్క పరుగు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఓపెనర్లు గిల్(9),, వెంకటేష్ అయ్యర్(18) తో పాటుగా కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (8) కూడా త్వరగా పెవిలియన్ చేరుకోవడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ కొంచెం గాడి తప్పింది. కానీ ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి(45) తో రాణించగా చివర్లో నితీష్ రాణ(37), దినేష్ కార్తీక్ (27) మంచిగా పరుగులు చేయడంతో కోల్‌కతా నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేస్తుంది.