సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. యూపీలోని జెవార్‌లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. నోయిడాలో నిర్మించబోతున్న ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదని, దీని ద్వారా ఈ ప్రాంతానికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షమందికి ఉపాధి…