NTV Telugu Site icon

Gehlot vs Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం.. గెహ్లాట్-పైలట్ అంశంపై సమావేశం

Gehlot Sachin

Gehlot Sachin

రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. గత కొద్దిరోజులుగా సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం, యువనేత సచిన్ పైలట్ మధ్య పోరు కొనసాగుతోంది. గెహ్లాట్‌పై పైలట్ తిరుగుబాటుకి నాయకత్వం వహించడంతో 2020లో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా బయటపడ్డాయి. ఇద్దరు నేతలు గతంలోనూ పలు సందర్భాల్లో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
Also Read:Sale of Cow: ఆ ఆవు ధర రెండు లక్షలు..

సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ నిర్వహించిన నిరాహార దీక్షపై హైకండ్ సీరియస్ గా ఉంది. గెహ్లాట్ వర్సెస్ పైలట్ వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని పార్టీ అగ్రనాయకత్వం గ్రహించింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్‌లకు సంబంధించిన పరిస్థితిని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఈ సమావేశానికి సచిన్ పైలట్‌ని కూడా పిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read:Opposition Unity: నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!

దీనికి సంబంధించి రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జిందర్ రంధావా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సచిన్ పైలట్ లేవనెత్తిన అవినీతి అంశాన్ని తాను అంగీకరిస్తున్నాను అని సుఖ్‌జిందర్ రంధావా అన్నారు. కానీ అతని పద్ధతి తప్పు అని, పైలట్ ఆ అంశాన్ని అసెంబ్లీ సమావేశాలలో లేవనెత్తాలి అని చెప్పారు. సచిన్ పైలట్‌తో అరగంట చర్చ జరిగిందని, అన్ని విషయాలను విశ్లేషించి నివేదికను సిద్ధం చేశారు. సవివరమైన నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించారు. రాంధావా నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఖర్గే రాహుల్‌తో కూడా చర్చించారు. ఇప్పుడు రాహుల్ దీనిపై సోనియాతో చర్చించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీ కుటుంబం అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఖర్గేదే తుది నిర్ణయం’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read:Deputy CM Narayana Swamy: దళితుడిననే కదా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు.. డిప్యూటీ సీఎం ఆవేదన..
రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కి వ్యతిరేకంగా పైలట్ నిరాహార దీక్ష చేశారు. గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని దీక్ష చేశారు. అయతే, దీక్షలో సచిన్ పైలట్ మద్దతుదారులు మినహా పెద్ద కాంగ్రెస్ నేతలు పాల్గొనలేదు. ఎన్నికల వేళ పైలట్ తీరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బిజెపి ప్రభుత్వ హయాంలో అవినీతిపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ పార్టీ నాయకుడు సచిన్ పైలట్ చేసిన పగటిపూట నిరాహార దీక్షను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది, ఇది పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని, పార్టీ వ్యతిరేక చర్య అని పేర్కొంది.