సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంట్ సమావేశాల తొలిరోజు ఎమర్జెన్సీ వర్సెస్ అప్రకటిత ఎమర్జెన్సీపై చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దానిని అమలు చేసిందని ప్రధాని మోడీ అన్నారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ గురించి మాట్లాడి ఇంకెంత కాలం పాలించాలనుకుంటున్నారని ప్రధాని…