హుజురాబాద్ బై పోల్.. కొండా సురేఖకు కాంగ్రెస్ డెడ్‌లైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇక, గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది… ఇప్పటికే పలు దఫాలుగా హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించింది టి.పీసీసీ.. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తోంది.. ఇప్పటికే అధిష్టానానికి కూడా సురేఖ పేరును రిఫర్ చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆమె మాత్రం ఇంకా ఎటూ తేల్చడం లేదట.. దీంతో.. ఇవాళ సాయంత్రం వరకు కొండా సురేఖకి గడువు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. పోటీ చేసేది.. లేనిది తేల్చేయాలని సూచించింది.. కాదంటే, మరో అభ్యర్ధి కోసం ప్రయత్నాలు చేస్తామంటోంది పీసీసీ.
మరోవైపు హుజురాబాద్ బై పోల్ బరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పెట్టాలని పార్టీ సీనియర్ నేతలు సూచించినట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్.. బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలిపితే కలిసివస్తుందని కొందరి నేతల వాదనగా ఉంది. ఇక, కాంగ్రెస్ పార్టీ ముందు కొండా సురేఖ కొన్ని డిమాండ్లు ఉంచింది.. వరంగల్‌లో మూడు సీట్లకు వచ్చే ఎన్నికల్లో పోటీకి హామీ ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు.. అయితే, హుజురాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాలపై ఇప్పటికే కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చిందట. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు డెడ్‌లైన్ విధించారు.. మరి.. సాయంత్రం లోపు కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!