Site icon NTV Telugu

Congress: రెండో రోజు కాంగ్రెస్‌ ఆందోళన.. నల్ల దుస్తులు ధరించి నిరసన

Congress Protest

Congress Protest

రాహుల్ గాంధీపై అనర్హాత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టింది. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్‌గాంధీపై పార్లమెంట్‌కు అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆదివారం రాజ్‌ఘాట్‌లో జరిగిన నిరసన తర్వాత ఈరోజు వరుసగా రెండో రోజు ఆందోళన వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ సీనియర్ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.

Also Read: NTR 30: ఎన్టీఆర్ తో మొదలయ్యింది… ఎన్టీఆర్ తోనే ముగుస్తుందా?

అంతకుముందు సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే కార్యాలయంలో తృణమూల్ నేషనల్ కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు సమావేశమై పార్లమెంటు సమావేశానికి ముందు తమ వ్యూహంపై చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఒకే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటివరకు కాంగ్రెస్ నిరసనలకు దూరంగా ఉంది. ఆ తర్వాత పార్లమెంట్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. లోక్‌సభకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
Also Read:వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!

ఆదివారం రాజ్ ఘాట్ వద్ద జరిగిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పి చిదంబరం, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం నాడు బిజెపి ద్వంద్వ ప్రమాణాలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

Exit mobile version