పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్‌ను తగిలించుకుని హల్‌చల్ చేశారు.
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని తెలిపారు.
ఈ రోజు ( మంగళవారం ) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.
రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో.. రేపు మధ్యహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్యరజన్ ప్రమాణం చేయించనున్నారు. ఇకపోతే.. రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం…
లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు.
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… అన్ని పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ.. పాత, కొత్త కేంద్ర మంత్రులకు సూచనలు చేయగా.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా.. రేపు సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై…