తెలుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యాయవాది సీజేఐ అయ్యే అవకాశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి న్యాయమూర్తుకు సంబంధించిన సిఫార్సులు చేసింది.. 9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న ( కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి)తో పాటు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ భారత ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
భారత ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) గా పనిచేసిన సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ పేరును కేంద్రానికి సూచించింది కొలీజియం.. దీంతో.. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన పీఎస్ నరసింహ.. భవిష్యత్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామయ్య కుమారుడు. కొలీజియం సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పిఎస్ నరసింహ పేరునుగనుక ప్రభుత్వం ఆమోదిస్తే, బార్ అసోసియేషన్ నుంచి ఇప్పటివరకు నేరుగా న్యాయమూర్తులుగా నియామకమైన 9 మందిలో ఒకరు కానున్నారు.
Also Read
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!