రోజురోజుకీ ట్రెండ్ పెరిగిపోతోంది. పెంపుడు జంతువుల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు జనం. శునకాలకు బర్త్ డేలు చేయడం, వాటిని అందంగా అలంకరించడం మామూలైపోయింది. తాజాగా ఓ కోడిపుంజుకి హ్యాపీ బర్త్ డే చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యాపీ బర్త్ డే కోసం అందంగా అలంకరించారు. మంచి కేక్ కూడా తెచ్చారు.
తెల్లతెల్లగా మిలమిలా మెరిసిపోతున్న ఆ కోడి పుంజు పేరు కన్నయ్యట. కేక్ తో వేదికను అలంకరించిన యజమానులు, పిల్లా పెద్ద అందరితో కలిసి వేడుక నిర్వహించారు. ఆ కోడిపుంజు మహారాజ్ భయపడతాడని డీజే లాంటివి పెట్టలేదు. ఒక చాకు తీసుకుని కోడి కాలితో దానిని కట్ చేయించారు. కన్నయ్య ఇది కట్ చేయమని అమ్మ చెబితే పక్కనే వున్న అమ్మాయి కోడిని పట్టుకుని కేక్ కట్ చేయించింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.ఈ కోడి పుంజుకి ఏం పెట్టి పెంచుతున్నారో యజమానులు. జీడిపప్పు, బాదం.. గట్రా వేసి పెంచుతున్నట్టున్నారు. రెండో బర్త్ డే వేళ ఏమాత్రం బెదరకుండా చేతిలో ఇమిడిపోయింది ఈ కోడిపుంజు.