ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రెండు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుంచి రేణిగుంటకు బయల్దేరి వెళ్తారు జగన్. అలాగే, రాత్రి 7 గంటల ప్రాంతంలో రేణిగుంటకు చేరుకునే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం రేణిగుంట నుంచి తిరుమల చేరుకుంటారాయన. రాత్రి తొమ్మిదిన్నరకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరిగి రేణిగుంటకు చేరుకుని… అక్కడి నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు ముఖ్యమంత్రి. రేపు మధ్యాహ్నం ఒంటిగంటం పావుకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి చేరుకుంటారు సీఎం జగన్. 3 గంటలకు జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.