మేజర్ ప్రొజెక్ట్‌లు శ్రీకాకుళం జిల్లాకు రావడం లేదనే ఆవేదన జిల్లావాసుల్లో ఉంది. దశాబ్దాలుగా భావనపాడు పోర్ట్ ఎన్నికల హామీగానే మిగిలింది.శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈనెల 19వ తేదీన మూలపేట పోర్ట్‌కు సీఎఎం శంకుస్థాపన చేయనున్నారు. పోర్ట్ నిర్మాణం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి దొహాదపడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు తలమానికమైన ప్రాజెక్ట్ మూలపేట పోర్ట్‌తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఏప్రిల్ 19 వతేదీన పోర్ట్‌తో పాటు వంశాధార లిప్ట్ ఇరిగేషన్ ప్రోజెక్ట్, బలసల రేవు వంతెనలకు సీఎం శంకుస్థాపన చెయనున్నారు.
Also Read:Arman Malik: అల్లు అర్జున్ కి పాడేసాను… మహేష్ బాబుకి బాలన్స్ ఉంది…
మరోవైపు ఇప్పటికే పోర్టుకు సంబంధించిన భూసేకరణ పూర్తయింది. పోర్టుకు అవసరమైన భూములను మూలపేట గ్రామంలో ఎకరాకు రూ. 25లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి ద్వారా నిర్వాసితులకు ప్రత్యేకంగా పునరావాస కాలనీ కోసం కె.నౌపడలో ఎకరా రూ.26లక్షలు వెచ్చించి అవసరమైన భూమిని కొనుగోలు చేసి సిద్ధం చేసింది. భావనపాడు పోర్టు కోసం 675.60ఎకరాలను సేకరించింది ప్రభుత్వం. ఇందులో ప్రైవేటు భూములు 433.71ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89ఎకరాలు ఉన్నాయి. రూ.3200కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్న భావనపాడుకు సీఎం జగన్ శంకుస్థాపన చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.