టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్ లపై ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మేజర్ ప్రొజెక్ట్‌లు శ్రీకాకుళం జిల్లాకు రావడం లేదనే ఆవేదన జిల్లావాసుల్లో ఉంది. దశాబ్దాలుగా భావనపాడు పోర్ట్ ఎన్నికల హామీగానే మిగిలింది.శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈనెల 19వ తేదీన మూలపేట పోర్ట్‌కు సీఎఎం శంకుస్థాపన చేయనున్నారు.