శీతాకాలం ఆరంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. మంచుదుప్పట్లు కప్పేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఇండియా చైనా బోర్డర్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ కి పడిపోతాయి. అలాంటి సమయంలో అక్కడ పహారా నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎంతటి కఠినమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకొని భారత సైనికులు కాపలా కాస్తుంటారు. అయితే, ఇటీవలే ఇండియా చైనా దేశాల మధ్య 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడంతో చైనా మళ్లీ తన పాత పంంథాను అనుసరించడం మొదలుపెట్టింది. ఇండియాను భయపెట్టేందుకు బోర్డర్ ప్రాంతానికి 100 రాకెట్లను తరలించింది. అయితే, భారత సైనికులు అలవాటు పడిన విధంగా చైనా సైన్యం అతి శీతల ఉష్ణోగ్రతలు తట్టుకొని మనుగడ సాగించలేరని నిపుణులు చెబుతున్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితులకు డ్రాగన్ సైనికులు అలవాటు పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్చలు విఫలమయ్యాక డ్రాగన్ 100 పీసీఎల్ 181 లైట్ ట్రక్ మౌంటెడ్ హోవిట్జర్లను తరలించింది. భారత్ ఇప్పటికే ఎం 777 రాకెట్ లాంచర్లను తరలించిన సంగతి తెలిసిందే. చైనా పీసీఎల్ 181 కంటే ముందే పీసీఎల్ 191 రాకెట్ లాంచర్లను కూడా ఎల్ఏసీకి తరలించింది. డ్రాగన్ ఎన్ని ఆయుధాలను తరలించినా, చైనా ఆర్మీ కఠినమైన వాతారవణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలగాలని, అప్పుడే ఫలితం ఉంటుందని, వాతారణ పరిస్థితులను భారత సైన్యం తట్టుకొని నిలబడగలదని అధికారులు చెబుతున్నారు. ఇక భారత్ శీతాకాలంలో సైనిక సంపత్తితో పాటుగా సరిహద్దుల్లో రాడార్లు, సెన్సర్లు, కెమెరాలు, మోషన్ డిటెక్టర్లు ఏర్పాటు చేసింది. ఎల్ఏసీ ఆవల చైనా సైనికులను కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను తయారు చేసింది భారత్. ఫేస్ రికగ్నైజర్‌గా పిలిచే ఈ సాప్ట్‌వేర్‌ను భారత్ ఆర్మీ సొంతంగా తయారు చేసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ఆధారంగా చైనా సైనికుల కదలికలను ఎప్పటి కప్పుడు పసిగడుతుంది ఈ సాప్ట్‌వేర్.