క‌రోనా దెబ్బ‌కు ర‌ష్యా అతలాకుత‌లం…రికార్డ్ స్థాయిలో కేసులు…మ‌ర‌ణాలు…

గ‌త రెండేళ్లుగా ప్ర‌పంచం మొత్తాన్ని అతలాకుత‌లం చేసిన క‌రోనా ఇప్ప‌టికీ భ‌య‌పెడుతూనే ఉన్న‌ది.  ర‌ష్యా, చైనా, న్యూజిలాండ్, బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా దేశాల్లో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయి.  రష్యాలో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  నిన్నటి రోజున ర‌ష్యాలో ఏకంగా 40,096 పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా, 1159 మంది క‌రోనాతో మృతి చెందారు.  ర‌ష్యాలో అత్య‌ధికంగా న‌మోదైన కేసులు ఇవేన‌ని నిపుణులు చెబుతున్నారు.  ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  అక్టోబ‌ర్ 30 వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 6 వ తేదీ వ‌ర‌కు వారం రోజుల‌పాటు జీతంతో కూడిన సెల‌వులు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.  ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించింది.  ర‌ష్యాలో మొత్తం 14.6 కోట్ల మంది జ‌నాభా ఉండ‌గా, ఇందులో కేవ‌లం 4.9 కోట్ల మంది మాత్ర‌మే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.  

Read: కిమ్‌పై ఆ దేశ ఎన్ఐఎస్ కీల‌క వ్యాఖ్య‌లు…

Related Articles

Latest Articles