ఆ నాలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు…

ద‌క్షిణ భార‌త‌దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసుల ఉధృతి కొన‌సాగుతున్న‌ది.  తెలంగాణ మిన‌మా మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1520 కేసులు న‌మోదు కాగా, త‌మిళ‌నాడులో 1568 కేసులు, క‌ర్ణాట‌క‌లో 1220 కేసులు న‌మోద‌య్యాయి.  అయితే, కేర‌ళ‌లో మాత్రం ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ రాష్ట్రంలో 29,322 కేసులు న‌మోద‌వ్వ‌గా, 131 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  గ‌తంలో మ‌హారాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆసంఖ్య భారీగా త‌గ్గిపోయింది.  కానీ, కేర‌ళ రాష్ట్రంలో మాత్రం కేసులు త‌గ్గ‌డంలేదు.  ఓనం పండుగ త‌రువాత కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జలు ఆందోళ‌న చెందుతున్నారు.  కేర‌ళ రాష్ట్రంలో పాజిటివి రేటు 17.91గా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  రిక‌వ‌రి కేసుల కంటే పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా ఉండ‌టంతో నిబంధ‌న‌లను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  

Read: మొద‌లైన తాలిబ‌న్ పాల‌న‌: 2.0 లోనూ మ‌హిళ‌ల ప‌రిస్థితి అంతేనా..!!

Related Articles

Latest Articles

-Advertisement-