వరద బాధితులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరఫున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఇస్తామని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమని ఆరోపించారు.
Read Also: విధ్వంసానికి.. సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ : నారా లోకేష్
Also Read
భారీ వర్షాలకు కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఆకాశంలో విహరిస్తే.. కింద ఉన్న బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. నాడు ఓట్ల కోసం రోడ్లు పట్టుకుని తిరిగిన జగన్, సీఎం అయ్యాక ఏరియల్ సర్వేతో సరి పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్… వరదల వల్ల సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మారితే 5 లక్షల పరిహారం మాత్రమే ప్రకటించడం న్యాయమా అని ప్రశ్నించారు. వరదల్లో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు కడప జిల్లాలోని వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు తెలుగుదేశం తరపున రూ.లక్ష పరిహారాన్ని,,, అలాగే వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఆర్థికసాయాన్ని ప్రకటించారు. (1/4)#CBNInKadapa pic.twitter.com/W59kahfR50
— Telugu Desam Party (@JaiTDP) November 23, 2021
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..