విధ్వంసానికి.. సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ : నారా లోకేష్

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, వైసీపీ సర్కార్‌ పై టీడీపీ యువ నేత నారా లోకేష్‌ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. విధ్వంసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సీఎం జగన్‌ అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేసారని మండిపడ్డారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమేనని ఆగ్రహించారు నారా లోకేష్‌. 15 వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత ఖాతాల్లో సొమ్ము జీరో అయితే వారు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలని డిమాండ్‌ చేశారు.

Related Articles

Latest Articles