గత రెండు సంవత్సరాలుగా భారత్‌తో పాటు యావత్త ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అయితే మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి గత కొన్ని రోజుల నుంచి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీ పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల క్రితం భారత్‌లో 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు, తాజాగా లక్షకుపైగా నమోదయ్యాయి.
ఇలా రెట్టింపు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చేవారికి వారంపాటు హోం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విదేశాలను నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని, ఆ తరువాత నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే ఇంటికి వెళ్లాలని కేంద్రం సూచించింది.